బేగంపేట జూన్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్)
పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనీ ,బేగంపేట మాజీ కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి అన్నారు.ఆదివారం బేగంపేట మయూరి మార్గ్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు టి. శ్రీహరి, బేగంపేట్ డివిజన్ జనరల్ సెక్రటరీ ఆరిఫ్ , కూకట్పల్లి డివిజన్ జనరల్ సెక్రెటరీ నరేష్ , శ్రీనివాస్ , పలువురు పార్టీ కార్యకర్తలు, నాయకులు అలాగే హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
