తాళ్లూరు మండ లంలో శివరాంపురం గ్రామంలో భూవివాదం పై జరిగిన ఘటనలో నమోదయిన కులదూ షణ కేసుపై దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ విచారణ నిర్వహించారు. శివరాంపురంగ్రామంలో హద్దులు మార్చి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలాన్ని సోమవారం ఆయన పరి శీలించారు. గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన అనపర్తి సమాధానం, షడ్రక్ ల కు
చెందిన స్థలాన్ని తప్పుడు హద్దులుచూపి రిజిస్ట్రేషన్ చేయించుకుని నిర్మాణాలు చేపడుతుండగా ప్రశ్నించినందుకు బొగ్గుల శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు కులంపేరుతో దూషించిన ఘటనపై కేసు నమోదయిన అయినది.
బొగ్గులశ్రీనివాసరెడ్డి కుటుంబీకులు కొను గోలుచేసిన స్థలానికి హద్దులు మార్చి షడ్ర క్కు చెందిన కొంత భూమిని అక్రమంగా రిజి స్ట్రేషన్ చేయించుకున్నట్లు ప్రాథమిక సమాచా రాన్ని సేకరించారు. ఈమేరకు దర్శి డీఎస్పీ గ్రామంలో శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు కొను గోలు చేసిన స్థలాన్ని, రికార్డుల మేరకు స్థలం హద్దులను స్థలం వద్దకు వెళ్లి పరిశీ లించారు.తమ ఆస్తిని అక్రమంగాతప్పుడు రిజి స్ట్రేషన్తో ఆక్రమించారని ఫిర్యాదు చేసిన బాధితులను డీఎస్పీ విచారించారు. ఆయన వెంట ఎస్సై ఎస్.మల్లికార్జునరావు, రైటర్ పి.దాసు తదితరులు ఉన్నారు.
శివరాంపురం లో కుల దూషణ కేసుపై దర్శి డీఎస్పీ విచారణ
30
Jun