ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహా సభ మహిళా గౌరవ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి డాక్టర్
శిద్దా రాఘవరావు సతీ మణి లక్ష్మీపద్మావతి నియమితుల య్యారు. ఈ మేరకు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య మంగళ వారం డాక్టర్ శిద్దా రాఘవరావు నివాసంలో లక్ష్మీపద్మావతికి నియామకపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గౌరవ అధ్యక్షురాలి పదవిలో తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ శిద్దా రాఘవరావు, దేవకి వెంకటేశ్వర్లు, పెనుగొండ సుబ్బారాయుడు, దర్శి వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను శిద్దా రాఘవరావు దంపతులు శాలువాలతో సత్కరించారు.
