రామ్ గోపాల్ పేట జూన్ 30,జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ బోయిగూడలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) కార్యక్రమం మంగళవారం చురుగ్గా సాగింది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ బూత్ లెవల్ అధికారి (BLO) సాల్మన్ రామ్ గోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ నివాసానికి చేరుకుని, వారికి ఎన్యూమరేషన్ ఫారమ్ ను అందజేశారు.
ఈ సందర్భంగా అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ స్థానికులతో మాట్లాడారు. డివిజన్ పరిధిలోని ప్రజలందరూ డోర్ టు డోర్ ఎస్ఐఆర్ సర్వేను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కోరారు. బూత్ లెవల్ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులను ఫారమ్‌లో నమోదు చేయించాలని సూచించారు. అధికారులు అడిగిన వివరాలను అందిస్తూ, ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విజయవంతం కావడానికి పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
