తాళ్లూరు మండల కేంద్రంలో బుధవారం ప్రజా దర్భార్ కార్యక్రమం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్లు టిడిపి మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు ముఖ్య అతిధులుగా పాల్గొంటారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకని తమ పరిధిలోని సమస్యలను ప్రజా దర్బార్ లో పరిష్కరించుకోవలసినదిగా కోరారు. ముందుగా ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చంద్రగిరిలో ఎన్ టిఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
