ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలి పెంచాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్ అన్నారు.ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమ ప్రభుత్వం.గా వుందన్నారు. గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు అయిన కొద్ది రోజులలోనే ఆరు గ్యారంటి పధకాలు అమలు చేయడం రేవంత్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని , శ్రీ గణేష్ అన్నారు. ఆరవ వార్డు తాడ్ బంద్ లో స్థానిక మహిళలు ఏర్పాటు చేసిన సమావేశానికి శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం. గృహలక్ష్మి పధకం క్రింద రెండు వందల యూనిట్స్ వరకు ఉచిత కరెంటు. ఐదువందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇలాంటి పథకాలు మహిళల కోసం అమలు అవుతు న్నాయని అన్నారు. ప్రతి పేదవారికి ఆరు ప్రభుత్వ పథకాలు అందేలా తాను కృషి చేస్తానని శ్రీ గణేష్ అన్నారు. త్వరలో అర్హులు అయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కూడా అందజేస్తామని ఆయన హామీచ్చారు. వంద రోజుల్లో పేద ప్రజల కోసం పధకాలు అమలు చేస్తున్నప్పటికీ బి అర్ఎస్ . బీజేపీ పార్టీ ల నేతలు ఓర్వలేక ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మే పదమూడున జరిగే లోక్ సభ ఎన్నికతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాలని ఆ రెండు ఓట్లు కూడా చేతి గుర్తుపై వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళ బి బ్లాక్ ప్రెసిడెంట్ తుపాకి స్వరూప, మలక బేగం, ధనలక్ష్మి, సీతల్, అభిద్, ఖాజా, కాలనీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు


