తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ క్యాలెండర్ ఆవిష్కరణ….రోగ నిర్ధారణ లో ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర ఎంతో కీలకం….. వైద్య విద్యా సంచాల కులు డాక్టర్ వాణి.

రోగ నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్లు పాత్ర ఎంతో కీలక మైందని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వాణి అన్నారు .మంగళవారం ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ మరియు ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్ సమక్షంలో, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ( పరిపాలన వైద్య విద్య సంచాలకులు) డాక్టర్ వాణి మరియు అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.శివరామకృష్ణ చేతుల మీదుగా 2024. క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వాణి మాట్లాడుతూ రోగనిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమైనదని, వారి సామర్త్య నైపుణ్యాలను కొనియాడారు.అనంతరం ప్రజారోగ్య సంచాలకులు డా.రవీంద్రనాయక్ గారు అసోసియేషన్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ల్యాబ్ టెక్నీషియన్లు తమ విస్తృతమైన సేవలను ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్నారని, ఈ సందర్భంగా వారికి ఆయన శుభాకాంక్షలు తెలియ జేశారు.రాష్ట్ర అధ్యక్షులు హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా ల్యాబ్ టెక్నీషియన్లపై తీవ్రమైన పని భారం ఉందని, అయినప్పటికీ చాలా సమర్థవంతంగా ల్యాబ్ టెక్నీషియన్లు తమ తమ సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీని పదోన్నతులు పెండింగ్ లో ఉంచారని, ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ముగియగానే వెంటనే ల్యాబ్ టెక్నీషియన్లు కు పదోన్నతుల ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, ఉపాధ్యక్షులు పురుషోత్తం, ప్రవీణ్, బసప్ప, కార్యవర్గ సభ్యులు భాస్కర్, కౌసరఉన్నిసా, ముజీబ్, శ్రీనివాస్, నరసయ్య, రత్నమాల, కవిత, విజయ భాస్కర్, శ్రీనాథ్ మరియు వివిధ జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *