పైగా ప్యాలస్ లో ఘనంగా కోట నీలిమ జన్మ దినోత్సవ వేడుకలు -సర్వమత ప్రార్థనలు.

సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ జన్మ దిన వేడుకలు బుధవారం బేగంపేట పైగా ప్యాలెస్ లో బేగంపేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కోట నీలిమ, పవన్ ఖేరా దంపతులు బల్కం పేట ఎల్లమ్మ ఆలయం, బేగంపేట కట్ట మైసమ్మ ఆలయం లో పూజలు చేశారు. అనంతరం బేగంపేట పైగా ప్యాలస్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ …పవన్ ఖేర , కోట నీలిమ దంపతులు నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో వుండాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా కోట నీలిమని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్,సీనియర్ నాయకులు హోసే తోచేర్,విశాల్ సుధామ,అమరం శ్రీనివాస రెడ్డి,మహమ్మద్ నసీరుద్దీన్ (అడ్డూ),రాజేందర్ ,జహంగీర్ ,మహమ్మద్ అసలామ్,అడ్డూ మాజీద్ (సనత్ నగర్ ) కోట నీలిమని రూపాయి నాణాల తో తులాభారం నిర్వహించారు. ఈ వేడుకలలో నియోజక వర్గం నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *