తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరంలో కారు- పాల వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు ముందు. భాగం ధ్వంసమైంది. బొద్దికూరపాడు నుంచి దర్శి వెళ్తున్న కారు తూర్పుగంగవరంలో రోడ్డుపైకి వస్తున్న సమయంలో ఒంగోలు నుంచి తూర్పుగంగవరంలోకి వస్తున్న పాలవాహనం.. కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు లేక పోవడంతో పాటు ఆ సమయంలో ఆ మార్గంలో పాదచారులు ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది.
