ఉపాధి పనులపై అవగాహన కలిగి ఉండాలి – మెట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహణ -పాల్గొన్న ఏపీ డి పద్మశ్రీ

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేసే పనులపై మేట్ లు అవగాహన కలిగి ఉండాలని దర్శి క్లష్టర్ ఏపీడీ పద్మశ్రీ అన్నారు. తాళ్లూరు వైఎస్సార్కేపీ కార్యాలయంలో జరుగుతున్న మేట్ ల అవగాహన శిక్షణ కార్యక్రమంలో ఏపీడీ పద్మశ్రీ మాట్లాడుతూ.. కూలీలకు పనులు చూపించడంలో మొబైల్లో హాజరు వేయడంలో మేట్లు అవగాహన కలిగి ఉండటంతో పాటు ప్రతి కూలీకి పని చూపించడానికి క్షేత్ర స్థాయిలో పనుల ఎంపిక, అంచనాలతో అధికారులకు సహకారం అందించాలన్నారు. అంతే కాకుండా పని ప్రదేశంలో కూలీలకు పని నిమిత్తం సౌకర్యాల కల్పనతో అధికారులను సమన్వయం చేసుకోవాలని తెలిపారు. మొబైల్ ల లో హాజర్ విధానం, మస్టర్లు వేయడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె యుగ కీర్తి, ఏపీఓ బి. మురళి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు, కూలీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *