జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో యత్తపు కొండా రెడ్డి (లాయర్) దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ కొసనా గురు బ్రహ్మం, ఈఓ కార్తీక్, ఆర్ఎ శ్రీనివాసరావులు భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు.

