రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
రూ 36.03 కోట్లతో సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు
రూ 11.6 కోట్లతో రోడ్డు వెడల్పు సుందరీకరణ,
రూ 5.5 కోట్లతో వైఎస్సార్ పార్క్,
రూ 3.19కోట్లతో తహసీల్దార్ కార్యాలయం,
రూ 2 కోట్లతో పోలీస్ స్టేషన్,
రూ 3.16 కోట్లతోఎంపీడీఓ కార్యాలయాలు.. ప్రారంభోత్సవం
పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం సింహాద్రిపురం లో నూతనంగా నిర్మించిన రోడ్డు వెడల్పు సుందరీకరణ పనులు, వైఎస్సార్ పార్క్,
తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్
ఎంపీడీఓ కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండల కేంద్రంలో రూ 11.6 కోట్లతో నూతనంగా సుందరీకరరించిన రోడ్లు, జంక్షన్ లను మొదట ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ఫోర్ లైన్ సిసి రోడ్, బి.టి రోడ్ జంక్షన్ లు ఉన్నాయి. అనంతరం రూ 5.5 కోట్ల నిధులతో 1.5 ఎకరాల్లో సుందరంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. ఇందులో ఎంట్రీలో ప్లాజా వాటర్ ఫౌండేషన్,చిన్నపిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ , వైఎస్ఆర్ విగ్రహం ..లను అందంగా ఏర్పాటు చేశారు. అనంతరం రూ 3.19కోట్ల పాడానిధులతో నిర్మించిన న్యూ తహశీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ ను, రూ 2 కోట్ల నిధులతో నిర్మించిన న్యూ పోలీస్ స్టేషన్ ను,రూ 3.16 నిధులతో నిర్మించిన ఎంపీడీవో ఆఫీసును ఆయన ప్రారంభించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు,జెసి గణేష్ కుమార్, పాడ ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి,పులివెందుల ఆర్డీవో వెంకటేశం, నాయకులు, తదితరులు లు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సింహాద్రిపురం తహశీల్దార్ డి.మహబూబ్బాషా, ఎంపీడీవో జి కృష్ణమూర్తి, పోలీస్ అధికారులు


