ఘనంగా మమతా హై స్కూల్ స్పోర్ట్స్ డే వేడుకలు.

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో విమాన నగర్ కు చెందిన మమతా హై స్కూల్ స్పార్డ్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. పాటశాల డైరెక్టర్ మమతా అద్వర్యం లో వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి, ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లాయూత్ , స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి ఎన్. సుధాకర్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీ డాజ్యొతి ని వెలిగించి స్పోర్ట్స్ ఫ్లాగ్ ను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు, అనంతరం విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ ద్వారా క్రీడా గౌరవవందనాన్ని స్వీకరించారు . అనంతరం విద్యార్థులు చేసిన బాల్ డ్రిల్ , హోప్ డ్రిల్ , బట్టర్ ఫ్లై విన్యాసాలు చూపరులను వేశేషంగా ఆకర్షించాయి..అనంతరం హైదరాబాద్ జిల్లాయూత్ , స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి సుధాకర్ మాట్లాడుతూ .. చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆసక్తి కలిగించాయని అన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి పతకాలను అందజేసి 2023.. 24 స్పోర్ట్స్ డే ఛాంపియన్ గా నిలిచినా ఆజాద్ హౌస్ జట్టుకు ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను అందజేసి అభినందించారు . ఈ కార్యక్రమం లో స్పోర్ట్స్ డే ఫిజికల్ డైరెక్టర్ సుధీర్ , కోచ్ , రాజ్ కుమార్ ,పి ఈ టి లాజారియాస్ పాఠశాల ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు , పెద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *