ఒంగోలు అభివృద్ది పేరు తో పెద్ద పెద్ద చెట్లను నరికివేస్తున్న వైనం. ఈ పరిస్థితి తో ఒంగోలు కాలుష్య కాసారం కానున్నదా!! అవుననే అనిపిస్తుందని బిజేపి ఐటి సెల్ కన్వీనర్ గుర్రం సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మరింత వివరములు తెలుపుచూ… 22 వ డివిజన్ లోని కిచ్ఛాయి బావి దగ్గర ఉన్న వేమూరు కోటయ్య స్కూల్ లో ఉన్న పెద్ద చెట్ల ను, 21 వ డివిజన్ లోని రాజపనగల్ రోడ్లో ఉన్న పెద్ద చెట్ల ను, 18 వ డివిజన్ లో గుర్రం వారి కుంట లో ఉన్న అడివి ప్రాంతాన్ని మొత్తాన్ని నరికివేసి, ఒంగోలు లో పర్యావరణ సమతుల్యతకు దెబ్బతీస్తున్నారు. అంతేకాకుండా “కర్నో కార్పస్” అనే విషపు మొక్కలను ఊరు మొత్తం నాటడం జరిగింది. దీనితో ప్రాణవాయువు ఘోరంగా దెబ్బ తినడమే కాదు, బయంకరమైన శ్వాస కోశ, చర్మ వ్యాధులు సంభవిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుచున్నాయి.
మరో పక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం కూడా పెరిగి పోవడం తో పాటు, నగరంలో గృహ సముదాయములు మధ్య, కొన్ని చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తగల పెట్టడంతో భావి తరాల మాటలు దేవుడెరుగు, ప్రస్తుతిం వృద్ధులే కాకుండా యువకులు కూడా శ్వాసకోశ జబ్బులతో వైద్యశాలలు కిటకిటలాడుచున్నాయి. ఇప్పుడే వీటి ప్రమాద తీవ్రత కనపడుచున్నది. వ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ కింద ఇచ్చిన కేంద్ర నిధులతో తడి పొడి చెత్త సేకరణ ఆటో లను కొన్న రాష్ట్రలోని జగన్ కు ప్రచార రథాలు గా వాడుతున్నారు. తప్ప ఈ ప్రభుత్వానికి అసలు ఘన వ్యర్ధాలను నిర్వహించడమే చేత కావడం లేదు. తడి చెత్త తో విలువైన ఎరువు ను లేదా, గ్యాస్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చు గానీ, ఈ ప్రభుత్వానికి ఉత్పత్తి చేయడం చేత గాక కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేయడం తో పాటు, ఆ పథకాల పేర్ల తో అవినీతి చేస్తున్నదని గుర్రం సత్యనారాయణ తెలిపారు.
ప్రకాశం జిల్లా లో తీవ్ర వర్షా భావ పరిస్థితులు, భు గర్బ జలాలు ఎండిపోవడం తో పాటు, తీవ్రమైన నీటి ఎద్దడి చూడబోతున్నాం.
గతంలో పర్యావరణ శాఖ మంత్రిగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్న కాలం లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అడువులు పెంచడానికి 1743 కోట్ల రూపాయల నిధిని కూడా ఆంధ్ర ప్రదేశ్ కి ఇవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద మొత్తం నిధుల తో ఏమి చేశారు అనేది ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ప్రకృతి వనరులు నాశనం చేసి, దోచుకుని దాచుకొంటే వాటి ఫలితం తీవ్రత, ఘోరమైన ప్రకృతి వైపరిత్యాలు చూడక తప్పదు. పర్యావరణ సమతుల్యత కాపాడటం ప్రతి ఒక్కరి హక్కు.
దీనిలో కొస మెరుపు ఏంటి అంటే, పుట్టిన రోజు నాడు కేక్ కట్టింగ్ చేసినట్టే, ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు నాడు ఒంగోలులో ట్రీ కట్టింగ్ చేశారు.
బీజేపీ నాయకులు దీని పై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొట్టేసిన మొక్కల స్థానంలో లేదా మరో చోట పర్యావరణ సమతుల్యతని పాటిస్తూ వృక్షలను పెంచాలని, వ్యర్థ నిర్వహణ చేయ్యాలి అని, భు గర్బ జలాలను పెంచాలి అని, మురుగు కాల్వల నిర్వహణ చేయాలని, గోవులను కాపాడాలని, ఒక్క సారి వాడి పారేసే ప్లాస్టిక్ ని అరి కట్టాలని, గాలి నాణ్యత మెరుగు పరచే విధముగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలోని ప్రజలకు అవగాహన కలిగించాలని బిజేపి కార్యకర్తలు, పర్యావరణవేత్తలు కోరుచున్నారు.
