- టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి
మన చుట్టూ ఉన్న ప్రకృతి జీవజాలం అన్నీ కూడా, సర్వము భగవంతుని స్వరూపమని గోదాదేవి అమ్మవారు తిరుప్పావై ద్వారా తెలియజేశారని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి తెలిపారు.
సంతపేట సాయి మందిరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సన్నిధిలో తిరుప్పావై ప్రవచనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వారు 12వ పాశురము లోని విషయాలు వివరించారు. రజో, తమో గుణాలను తగ్గించుకుని సత్వ గుణాలను పెంచుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందన్నారు. తిరుప్పావై చదవడం లేదా, పారాయణం ద్వారా వేదాంత ఉపనిషత్తుల అర్ధాలు అన్ని మనకి సంపూర్ణంగా తెలుస్తాయని చెప్పారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అళహరి చెంచలరావు, భక్త బృంద ప్రతినిధి దామచర్ల కుమారి, అర్చక స్వామి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

