తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం గ్రామానికి చెందిన బొట్ల శ్రీనివాసులు(28) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం. రమేష్ తెలి పారు. పోలీసులు తెలిపిన వివరాలు.. తూర్పుగంగవరం గ్రామానికి చెందిన బొట్ల శ్రీనివాసులు స్థానిక రెస్టారెంట్లో పని చేస్తూ జీవం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం 27వ తేదీన జ్వరం ఉందని కుటుంబ సభ్యులకు తెలిపి ఇంటి వద్దే ఉన్నాడు.
మద్యం తాగుతూ తిరుగుతూ ఉన్నాడు.సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న గడ్డి మందు తాగాడు. చుట్టు పక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే ఒంగో లుకు తరలించి చికిత్స అందించారు. 28వ తేదీన మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య అరుణకుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు వెళ్లగా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
