ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో 2023 చిరుధాన్యాల సంవత్సరాన్ని పురష్కరించుకుని ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకు ఘన సన్మానం చేసారు. మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ.. రైతులకు ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రొత్సహించి సజ్జ, జొన్న, కొర్ర, రాగి, ఊద, వరిగలు పండించినట్లు చెప్పారు. 2023 సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సాగు సంవత్సరంగా ప్రకటించినందున ఏడాది పాటు సాగు నిమిత్తం రైతులకు విత్తన సరఫరా, సలహాలు, సూచనలు ప్రాసెసింగ్ యూనిట్స్ మార్కేటింగ్ చేయటం జరిగిందని చెప్పారు. వినియోగం నిమిత్తం చైతన్య పరుచుటకు వివిధ చిరుధాన్యాల తినుబండారాలను తయారీ ప్రదర్శన, ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించిన విధానాన్ని వివరించారు. చిరుధాన్యాలను సాగు చేయటం ద్వార రాష్ట్రంలోనే ఉత్తమంగా చేయించినందుకు వ్యవసాయాధికారి ప్రసాదరావును సన్మానించారు. ప్రకృతి సాగు ఇన్చార్జి పి నరసింహం మాట్లాడుతూ వ్యవసాయాధికారి ప్రసాదరావు రాష్ట్రంలోనే మిల్లెట్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారన్నారు. కార్యక్రమంలో రైతులు, ఇసిఆర్పిలు, చిరుధాన్యాల కుంకులను బోకేల రూపంలో ప్రదర్శించారు.


