రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి జిల్లాలోని రైతు భరోసా కేంద్ర స్థాయిలో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు, విస్తరణాధికారులు, సాంకేతిక సహాయకులు కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ కోరారు. ఒంగోలు డిఆర్సీలో ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో మూడు రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది. గ్రామ వ్యవసాయ సహాయలకు ఇతర సిబ్బందికి 15 పంటలకు సంబంధించి మేలైన యాజమాన్యంపై ఆత్మ ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించి గ్రామ వ్యవసాయ సహాయకులకు అందజేసారు. జిల్లాలోని అందరూ విఏఏ, ఎఈఓ, సాంకేతిక సహాయకులకు మూడు బ్యాచ్ లు గా పలు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు పీడీ అన్నపూర్ణ చెప్పారు. రైతు సంఘాల ఏర్పాటు, బలోపేతం, పుస్తక నిర్వహణ, సమగ్ర ఎరువుల యాజమాన్యం, శనగ పంటలో గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్న జె-11, కాగ్-2 రకాలకు ప్రత్యామ్నాయ రకాలైన ఎన్బిఈఏ 776, ఎన్సీఈఏ 119 రకాలను రైతు లు ఎలా అభివృద్ధి చేసుకోవాలని అనే అంశాలపై, జిల్లాలో సాగు చేస్తున్న 15 ప్రధాన పంటలకు సంబంధించిన మేలైన యాజమాన్య పద్ధతులు క్షేత్ర స్థాయిలో గమనించి ఛాయా చిత్రాలతో సహా గ్రామ వ్యవసాయ సహాయకుల ఉపయోగపడే విధంగా కరదీపికను తయారు చేసామని చెప్పారు. గ్రామ స్థాయిలో పనిచేసే ప్రతి వ్యవసాయ సిబ్బంది ప్రతి రైతు యొక్క అకౌంట్ అనగా వారు సాగు చేసిన ప్రతి పంటలకు సంబంధించిన సాగు ఖర్చు, నికర ఆదాయం వివరాలను సంబంధించిన అన్ని వివరాలు గ్రామ వ్యవసాయ సహాయకులు సేకరించి తగిన విధంగా రైతులకు సూచనలు చెయ్యాలని ఆత్మ పిడి అన్నపూర్ణ కోరారు .

