సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ఆర్పీలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమకు వేతనం పెంపుతో పాటు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు లాస్యనందితకు వారు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే లాస్యనందిత మాట్లాడుతూ ఆర్పీల సమస్యలను పరిష్కరించాలని ,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న ఆర్పీలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఎమ్మెల్యే లాస్యనందిత విజ్ఞప్తి చేశారు.
