సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 7 వ వార్డులోని తిరుమలగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే లాస్యనందిత సందర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ప్రజలకు అందుతున్న ఆరోగ్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుపేద రోగులకు నిరంతరం అందుబాటులో ఉండాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం అక్కడ చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆరోగ్యకేంద్రం ముందు చేపట్టబోయే షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే లాస్యనందిత భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వైద్యసేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లాస్యనందిత, డీఎంహెచ్ఓ రాజకుమారితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ సభ్యులు శ్యాం కుమార్, వార్డు 7 బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తేజ్ పాల్, సీనియర్ నాయకులు కేబీ శంకర్ రావు, శత్రుఘ్న మధు, వేణు, యశ్వంత్, కుర్మయ్య, మార్టిన్, రాజిరెడ్డి, పసస సంతోష్, గజ్జెల గోపాల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

