నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షా నిర్వహణ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, అధికారులను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీన ఒంగోలు నగరంలో నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష జరగనున్న నేపధ్యంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఒంగోలు నగరంలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన ఒంగోలు నగరంలో నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష మొత్తం ఆరు కేంద్రాల్లో, పిఎం కేంద్రీయ విద్యాలయం, డిఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డిఎ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పిఎం జవహర్ నవోదయ విద్యాలయం, డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్, పివిఆర్ మున్సిపల్ కార్పోరేషన్ బాలుర హై స్కూల్ నందు జరగనున్నట్లు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి మధురి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
