వైఎస్సార్సీపీ కీలక నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు నజ్జల రామక్రిష్ణా రెడ్డిని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఆయనను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లాలో పార్టీ అభ్యున్నతికి ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి చేస్తున్న కృషి, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న తీరును వివరించారు.
