నాణ్యమైన విద్యుత్ ను అందించటమే లక్ష్యంగా విద్యుత్ సిబ్బంది పనితీరు మెరుగు పరుచుకోవాలని విద్యుత్ ప్రకాశం జిల్లా ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు కోరారు. తాళ్లూరు నబ్ స్టేషన్ పరిధిలో సోమవారం సిబ్బందితో కలిసి అకస్మిక దాడులు నిర్వహించారు. అనంతరం విద్యుత్ సిబ్బందితో విద్యుత్ బిల్లులు వనూలు, లైన్ మెయింటెన్స్ తదితర సమస్యలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విద్యుత్ బిల్లులతో పాటు, ఎస్సీ, ఎస్టీ కాలనీలో అత్యధికంగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే వసూలు చెయ్యాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితం అని అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేయించి లబ్ధి అందేలా చూడాలని, అర్హత లేని వారి వద్ద బిల్లులు వనూలు చెయ్యాలని కోరారు. సోలార్ విద్యుత్పై అవగాహన పెంచాలని కోరారు. సిబ్బంది నక్రమంగా పనిచేయక పోతే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు, వినియోగదారుల నుండి ఫిర్యాదు అందినట్లయితే చర్యలు తప్పవని అన్నారు. ప్రజలు విద్యుత్ బిల్లులు నకాలంలో చెల్లించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సహకరించాలని కోరారు. అకస్మిక దాడులు నిర్వహించి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న 105 మంది కేసులు నమోదు చేసి రూ.2.77 లక్షల జరిమాన విధించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస రావు, ఎడీఈ రవి కుమార్, ఎఈ రామక్రిష్ణా, డివిజన్’ పరధిలోని ఎఈ లు నాగూర్ షరీఫ్ ,సచిన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు .
