రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 18వ తేదీన ఒంగోలులోని గుత్తా వెంకట సుబ్బయ్య కళ్యాణమండపంలో జిల్లాస్థాయిలో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టిడిపి ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు పేర్కొన్నారు. టిడిపి జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో నిర్వహించిన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధిపై చర్చా గోస్టీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 17వ తేదీన మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులు, ప్రజలతో జలధార, జల హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెన్నుపోటు రాజకీయాలంటూ వైసీపీ చేస్తున్న కార్యక్రమాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి మరచి, ప్రజలను నిలువునా వెన్నుపోటు పొడిచారన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ, ప్రజల సొమ్ము దోచుకు నేడు లిక్కర్ కేసులలో వైసీపీ నేతలు జైలుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం చేసిన ఘనత జగన్ కి దక్కుతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలో పెనుగొండ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తవుతున్నాయన్నారు. నిర్వాసితుల కోసం రూ. 1000కోట్లు కేటాయించి ముంపు ప్రాంత వాసులను గ్రామాలు ఖాళీ చేయించడం జరిగిందన్నారు. మార్కాపురం, నెల్లూరు జిల్లా వాసులకు సాగునీరు, తాగునీరు అందించడమే లక్ష్యంగా వినుకొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిని పూర్తిచేసి ప్రారంభించడం జరుగుతుందన్నారు. అందుకోసం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు పై ప్రత్యేక దృష్టి సాధించారని పేర్కొన్నారు. అలాగే జగన్ ప్రభుత్వ హయాం కాలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వని జగన్ డీఎస్సీ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ యువతను గందరగోళం పరిచేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో డీఎస్సీ కి సన్నద్ధమవుతున్న నే టి తరుణంలో ఇలా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. తిరుపతి విజయోత్సవ వేడుకలలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీలు చర్చలకు రమ్మని ఆహ్వానించిన ఒక వైసీపీ నాయకుడు చర్చకు రాలేదని ఎద్దేవా చేశారు. సొంత మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వైసిపి చర్చకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికాడు. ఈనెల 18న జరిగే విజయోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు మాట్లాడుతూ విజయోత్సవ వేడుకలలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టిడిపి ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, తంజావూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
