హైదరాబాద్, జూన్ 14, (జే ఎస్ డి ఎమ్ న్యూస్) :
నగరంలో రోడ్డు భద్రతనుపెంపొందించడానికి మరియు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 12, 13 తేదీలలో (రెండు రోజుల పాటు) నగరవ్యాప్తంగా విస్తృతంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనాలునడపడం) తనిఖీలునిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ మొత్తం 281 మంది వాహనదారులు పట్టుబడ్డారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 281 మందిలో ద్విచక్ర వాహనదారులు (Two-wheelers): 219 మంది,త్రిచక్ర వాహనదారులు (Three-wheelers): 30 మంది,కార్లు మరియు ఇతర భారీ వాహనదారులు (Four-wheelers & Others): 32 మంది రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC Levels) ఆధారంగా తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలునిర్వహించగా, వారి రక్తంలో నమోదైన ఆల్కహాల్ మోతాదు (BAC Levels) వివరాలు:క్రమ సంఖ్యరక్తంలో ఆల్కహాల్ మోతాదు (BAC Levels)నమోదైన కేసుల సంఖ్య130 – 5054 కేసులు251 – 100128 కేసులు3101 – 15048 కేసులు4151 – 20027 కేసులు5201 – 25009 కేసులు6251 – 30008 కేసులు7300 కి పైగా (Above 300)07 కేసులు నమోదు చేశారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ‘జీరో టాలరెన్స్’ (Zero Tolerance) విధానాన్ని అవలంబిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి అపరాధాన్ని సహించేది లేదని, ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని హెచ్చరించారు. నగరంలో రోడ్డు భద్రతను కాపాడటానికి, ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దడానికి వాహనదారులు మరియు ప్రయాణికులు అందరూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
వాహన దారుల భద్రతే ముఖ్యం.హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 281 కేసులు నమోదు.
14
Jun