ఒంగోలు టౌన్ రావి ఆంజనేయులు వీధి లో పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి – 6 మంది అరెస్ట్

ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ రవి ఆంజనేయులు వీధిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడిలు నిర్వహించారు. ఈ దాడిలో 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి నగదు మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
​వివరాలు….టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ పర్యవేక్షణలో, ఎస్సై , చెంచయ్య, ఏఎస్ఐ మహబూబ్ బాషా మరియు పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కోత ముక్క పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.
​స్వాధీనం చేసుకున్న వస్తువులు:
​నగదు: ₹4860/-
​మొబైల్ ఫోన్లు: 6 స్మార్ట్‌ ఫోన్లు
​సంఘటనా స్థలంలో పేకాట ఆడుతున్న 6 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టుబడిన వారిని, నగదు, ను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించడమైనది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *