ఓటర్ల జాబితా వేరిఫికేషన్ ను సమగ్రంగా పూర్తి చెయ్యాలని తహసీల్దార్ రమణారావు కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం బిఎల్ఎల సమావేశం నిర్వహించి నర్ నిర్వహించాల్సి విధానాన్ని వివరించారు. జులై 14 వరకు బి ఎల్ ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలించి తగిన పత్రాలను పూర్తి చేసి వారిచే సంతకాలు సేకరించాలని చెప్పారు. అందుకు సంబంధించి ఫారాలను, మెటీరియల్ను అందించారు. సిబ్బంది సుజాత తదితరులు పాల్గొన్నారు.
