ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, డీ.ఆర్.వో. మాధురి, ఆర్.డీ.వో. చంద్ర శేఖర్ నాయుడు, డీ.పీ.వో. వెంకటేశ్వరరావులతో కలిసి ఆయా వర్గాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ప్రజలు కోరిన నేపథ్యంలో ప్రతి నెలా మూడో సోమవారం వీరికోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం వచ్చిన 119 అర్జీలపై ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు మరింత దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

