ప్రతి గడపకి వెళదాం రెండేళ్ల కూటమి పాలనలో చేసిన అభివృద్ధిని గర్వంగా చెప్పుకుందాం – దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పిలుపు

దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నాయకత్వం లో మంగళవారం దర్శి పట్టణం, కురిచేడు రోడ్, లోని పి.టి.యస్ కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం రెండేళ్ల కూటమి పాలనపై విజయోత్సవ సభ లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయగలిగా ఒక వైపు సంక్షేమ మరో ఒకవైపు అభివృద్ధి చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నాం.
  • కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా రెండేళ్లు ప్రజల నమ్మకం అభివృద్ధి సంక్షేమం విజయోత్సవ సభను మంగళవారం దర్శి పట్టణంలో పి టి ఎస్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం.
  • రెండేళ్ల కూటమిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీస్తుంది మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజనరీ నేతగా ప్రజల భవిష్యత్తు కోసం బాటలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ బాబు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలు ఉపాధి విద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కొత్త సాంకేతిక విప్లవంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాంకేతిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళుతున్నాం.
  • మన నియోజకవర్గంలో గత ఐ దేళ్ళు వైసిపి పాలనలో విధ్వంసం చూసాం మన కూటమి ఏర్పడ్డ రెండు సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమం ప్రతి గడపకు చేర్చాలన్న లక్ష్యంతో ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మీ గొట్టిపాటి లక్ష్మి మీ కుటుంబ సభ్యురాలుగా కూటమి ప్రతినిధిగా నిరంతరం శ్రమిస్తుంది మీరు చూస్తున్నారు, మీరు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
  • గ్రామ గ్రామాన రోడ్లు నిర్మించుకుంటున్నాం మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతున్నాం. ప్రతి గడపకు ఒకటవ తేదీ పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో అందరి పిల్లలకు తల్లికి వందనం కింద చదువుకునేందుకు ప్రోత్సాహం అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ దర్శి లో ప్రారంభమై ప్రతి రైతుకు భరోసానిచ్చింది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు దర్శిలో రైతన్న పథకాన్ని ప్రారంభించడం శుభ పరిణామం. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు సౌకర్యం, డ్వాక్రా మహిళలకు రుణ వసతి, అన్న క్యాంటీన్ ఏర్పాటు, డిగ్రీ కాలేజీ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ లను ముందుకు తీసుకు వెళుతున్నాం. లో వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 20 కోట్లతో సబ్స్టేషన్ నిర్మించుకుంటున్నాం. మొగిలిగుండం ప్రాజెక్టును పూర్తి చేశాం. త్వరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుంటున్నాం. దర్శి లో టీటీడీ కళ్యాణం మండపం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మినీ స్టేడియంలో ముందుకు తీసుకు వెళుతున్నాం. నగర పంచాయతీగా ఉన్న దర్శిని థర్డ్ గేర్ మున్సిపాలిటీగా మార్చుకొని పది కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
  • ఇలా నిరంతరం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళుతుంటే గొడ్డలి పార్టీ వైసిపి దుష్ప్రచారం చేస్తుంది. వారి దుష్ప్రచారాన్ని మనం తిప్పి కొట్టాలి. ఐదు సంవత్సరాలలో వైసిపి ఒక టీచర్ పోస్టు అయిన ఇచ్చిందా అని ప్రశ్నిస్తున్నాను. టీచర్ పోస్ట్లు ఇవ్వకపోగా టీచర్లను చాలా దారుణంగా చూశారు.
  • మన ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీ తో 16,347వేల మంది టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత మన లోకేష్ అన్నది. అది చూసి ఓర్వలేక డీఎస్సీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులలో అలజడి కలిగిస్తున్నారు. ఇలాంటి వాటిని మనం ఖండించాలి.
  • గెలిచిన ఎమ్మెల్యే గారు ప్రజల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. అసెంబ్లీకి వెళ్ళరు, ప్రజాసమస్యలు ప్రశ్నించరు, ప్రజా సమస్యల కోసం పనిచేయరు, డీఎస్సీలో 15 లక్షలు తీసుకున్నారని ఆరోపించడం ఏమిటని తీవ్రంగా దీనిని మనమందరం తిప్పి కొట్టాలన్నారు. సైకో పార్టీ గ్లోబల్ ప్రచారాలను మనం తిప్పి కొట్టాలి. కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి.
  • కూటమి ప్రభుత్వం నాలుగు కాలాలపాటు అధికారంలో ఉంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దేశ దేశాలలో విస్తరిస్తుంది. మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు. అందుకే ఐక్యంగా ముందుకు వెళదాం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించుకుందాం. మీ గెలుపే నా గెలుపు నేను ఓడిపోయిన ప్రజల హృదయాలలో గెలిచాను. దర్శి ప్రజల రుణం తీర్చుకుంటాను. వచ్చే ఎన్నికల్లో దర్శిలో తెలుగుదేశం జెండా ఎగరవేదం. కూటమి ఐక్యంగా ముందుకు వెళదాం. ప్రతికూటమి నాయకులు, కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు.
  • అమరావతిని విధ్వంసం చేశారు, పోలవరం నాశనం చేశారు, అమరావతి బిల్లును ప్రవేశపెట్టుకొని చట్టబద్ధత కల్పించుకోగలిగాం. అమరావతిలో పనులు చేరవేగంగా జరుగుతున్నాయి. అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. దేశ దేశాలలో పర్యటిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరత పాలన కోసం చంద్రబాబు చేస్తున్న నిరంతర యజ్ఞంలో మనం కూడా భాగస్వామ్యం అవుతాం. అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళదాం. సంక్షేమాన్ని ప్రతి గడపకు చేరుద్దాం వైసిపి తప్పుడు ప్రచారాలను తిప్పికొడదాం.
  • నేను ప్రజల కోసం పనిచేస్తాను. పదవుల కోసం పనిచేయడం లేదు. నాకు పదవులు కొత్త కాదు గొట్టిపాటి కుటుంబంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అందరికీ తెలుసు మా తాత జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే మంత్రి. మా నాన్న ఎమ్మెల్యే, మా బాబాయి గొట్టిపాటి రవి గారు ప్రస్తుతం మంత్రివర్యులు. మాకు పదవులు కొత్త కాదు మేము పదవుల కోసం రాజకీయాలు లో లేము ప్రజల నమ్మకం కోసం ప్రజల ఆకాంక్షలను నిలబెట్టేందుకు ప్రజల కోసం పనిచేయడం మా ప్రయాణం.

దర్శి లో రెండేళ్ల కూటమి పాలనపై విజయోత్సవ సభకు విశేష స్పందన.*

▪️దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నాయకత్వం లో మంగళవారం దర్శి లో ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం రెండేళ్ల కూటమి పాలనపై విజయోత్సవ సభకు అనూహ్య స్పందన.

▪️ముఖ్య అతిధులు గా పాల్గొన్న…
దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర , మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , దర్శి సొసైటీ అధ్యక్షులు కలువకొలను చంద్ర శేఖర్, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ,
తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు , టిడిపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కూటమి శ్రేణులు ఉన్నారు.

అధికారులు : నియోజకవర్గ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్, FSO ఆఫీసర్ శాంతి లక్ష్మీ, ఎంపీడీఓ పి. కల్పన, అగ్రికల్చర్ ఏఓ అనురాధ, ఆర్​డబ్ల్యుఎస్ డి ఈ, మున్సిపల్ కమిషనర్ అర్జున్ రావు,

పాల్గొన్న ముఖ్య నాయకులు : నియోజకవర్గం లోని దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండల టిడిపి అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, పిడతల నెమిలయ్య, కూరపాటి శ్రీను, మేడం వెంకటేశ్వర రెడ్డి, దర్శి టౌన్ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ,

జనసేన నాయకులు :
ఉల్లి భ్రహ్మయ్య, పుప్పాల పాపారావు, కోట హనుమంత రావు, దర్శి టౌన్ అధ్యక్షులు చాతరాసి కొండయ్య, రుద్రసముద్రం హనుమంత రావు, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు, కుటాల ప్రసాద్,
పసుపులేటి చిరంజీవి,

బిజెపి నాయకులు :
రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్ట్ మాడపాకుల శ్రీనివాసరావు, బిజెపి జిల్లా కమిటీ సభ్యులు తిండి నారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కురిచేడు, ముండ్లమూరు, దర్శి కూరంగి నాగేశ్వరావు, శేషయ్య, నాగసాయి, దర్శి టౌన్ అమర్.

మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, రాష్ట్ర నటక కళాపరిషత్ డైరెక్ట్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, మనం రమేష్, వల్లపునేని సుబ్బయ్య, నాగుల పాటి శివకోటేశ్వర రావు, సోమేపల్లి శ్రీను, రమణ యాదవ్, నూనె విజయ కుమారి, శోభరాని, క్లస్టర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టివెన్, తలారికోటయ్య, కౌన్సిలర్లు, వార్డ్ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ & బూత్ ఇంచార్జీలు, సొసైటీ అధ్యక్షులు, నీటిసంగం DC లు, అధ్యక్షులు, మార్కెట్ యాడ్ డైరెక్టర్లు, ఐ. టిడిపి సభ్యులు, తెలుగు యువత, నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి జనసేన, బిజెపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభినందనలు వేలాదిగా పాల్గొన్నారు.

రెండేళ్ల విజయోత్సవ సభకు తరలిన తాళ్లూరు తమ్ముళ్లు…

దర్శి లో మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండేళ్ల పాలనపై విజయవంతం

పై నిర్వహించిన సభకు తాళ్లూరు తెలుగు తమ్ముళ్లు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ల ఆధ్వర్యంలో తాళ్లూరు మండలంలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను వారు వివరించారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక రంగ అకాడమి డైరెక్టర్ బి ఒబులు రెడ్డి, విద్యాసాగర్ , ఇన్చార్జిలు వెంకట రావు, కళ్యాణ్ చక్రవర్తి, గొల్లపూడి వేణుబాబు, రామయ్య, కైపు రామ కోటి రెడ్డి, నాగార్జున రెడ్డి, కరువది మేజర్ ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *