యువత మాదక ద్రవ్యాల జోలికెళ్లొదు – జీవితాలను పాడు చేసుకోవద్దు-దర్శి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు

యువత మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని దర్శి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు చెప్పారు. తూర్పుగంగవరం జడ్పీ హైస్కూల్లో బుధవారం విద్యార్థులతో డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా దర్శి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావుమాట్లాడుతూ ..తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్ల లను చదివిస్తున్నారని, మాదక ద్రవ్యాలకు బానిసలై చెడు మార్గంలో పయనిస్తే వారి ఆశయాలు నెరవేరవన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వైఎస్ఆర్కే ప్రసాద్, ఎస్ఏ వై.శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *