పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్ .

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గణేష్  పలు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రంగనాథ స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ రాష్ట్రం లో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలం లోనే ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోని ప్రభుత్వం ప్రజా రంజక మైన పరి పాలన అందిస్తుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీ తో విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.స్వామి వారి ఆశీస్సులతో కంటోన్మెంట్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీ వచ్చే విధంగా క్యాడర్ తో కలిసి గల్లీ గల్లీ లోని ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతామని.కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని  శ్రీ గణేష్ అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్ ..

*వెస్ట్ మారేడ్పల్లిలోని సాయిబాబ దేవాలయంలో* గురువారం  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీగణేష్ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీగణేష్  ఆధ్వర్యంలో  *సాయిబాబా మందిరంలో* అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..
ఈ సందర్భంగా శ్రీ గణేష్  మాట్లాడుతూ  సాయిబాబా ఆశీర్వాదం ఎల్లవేళలా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఉండాలని అన్నారు, ప్రజలు ఎప్పుడు సుఖసంతోషాలతో ఉండే లా చూడాలని సాయిబాబాను వేడుకున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు.
శ్రీ కాశి శివలింగేశ్వర స్వామి 35 వ వార్షికోత్సవం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీగణేష్.

కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డ్-02,శివనగర్ లో నీ శ్రీ కాశి శివలింగేశ్వర స్వామి అధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో *35వ వార్షికోత్సవం* నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధీగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీగణేష్  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శివాలయం ఆలయ కమిటీ అధ్యక్షులు గడప రమేష్ , ఉపాధ్యక్షులు ముడుగుల జనార్దన్ , కార్యదర్శి ఐలయ్య , కమిటీ మెంబెర్స్ మరియు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *