యువతలో సేవాభావాన్ని పెంచి, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజెప్పి, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో, ఇంటర్నేషనల్ ఓమౌజయ యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ (ఐ.ఏ.యు. వై.ఎస్.ఏ) అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఎస్.పి.మ్యాస్ట్రో ఆధ్వర్యం లో స్థాపించారు.
వారి మార్గదర్శకత్వంలో యువతకు నిరంతరం పలు రకాల సేవలు అందిస్తున్నారని,సంస్థ సభ్యులు విశ్వసారది అన్నారు. గురువారం ఐఏయూవైఎస్ఏ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని , కోర్ టీమ్ సహకారంతో,లాలాగూడ ప్రభుత్వ బాలుర పాఠశాల తో పాటు 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు గురువారం
మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేశారు.ఇప్పటికే హైదరాబాద్ ఐ. ఏ . యూ.వై.ఎస్.ఏ ఆధ్వర్యంలో వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఏయూవైఎస్ఏ సభ్యులు సురేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

