టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి పర్యటన విజయవంతం చెయ్యండి

తాళ్లూరు : మండలంలో పలు కార్యక్రమాలలో టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొననున్నట్లు ఆపార్టీ మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు వెలుగు సీహెచ్సీ కేంద్రం ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 11 గంటలకు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు ఎంపీపీగా పదవీకాలం పూర్తి చేయు సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. 11.30 గంటలకు మాధవరం ఎస్సీ కాలనీలో పాలెపోగు ఇంజ్రాయేల్ కుమారుడు యాకోబు పెళ్లి వేడుకకు పాల్గొని దీవేనలు అందిస్తారని చెప్పారు. అదే గ్రామంలో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన ఊడిగ నాగయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని వివరించారు. పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఆయా కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *