ప్రజా సమస్యల పరిష్కారం లో ప్రభుత్వం నిర్లక్ష్యం…ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట సెప్టెంబర్ 23(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బుధవారం రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో గల నెక్లెస్ రోడ్ లోని అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా లిఫ్టులు కొన్ని రోజులుగా పని చేయడం లేదని, లేదని ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సౌకర్యాలు, వసతులు లేని ఇరుకైన ఇండ్లలో నివసిస్తున్న పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు వసతులతో విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 5 అంతస్తులతో 5 బ్లాక్ లను నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. లిఫ్టులు పని చేయకపోవడం వలన ఇందులో పై అంతస్తులలో ఉంటున్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం లిఫ్టులను మరమ్మతులు చేయించడంలో ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. ఇక్కడ ఉండే వారంతా నిరుపేదలేనని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ఆయన స్పష్టం చేశారు. వెంటనే లిఫ్టుల మరమ్మతులు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తమ కాలనీ వాసుల అవసరాల కోసం కమిటీ హాల్ నిర్మించాలని కోరగా, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట హౌసింగ్ DE సురేంద్రనాధ్, ఎలెక్ట్రికల్ AE శివరామకృష్ణ, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, రాంగోపాల్ పేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, సతీష్, ఆంజనేయులు, అరుణ్ భట్, చంద్ర ప్రకాష్, జనార్దన్, అభిలాష్, కాలనీ నాయకులు గణేష్, దేవరాజ్, రవి సింగ్, షర్పోద్దిన్, కాలనీ అధ్యక్షులు లక్ష్మీ, సభ్యులు గౌసియా, ఆమని, రమ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *