తాళ్లూరు: మండల కేంద్రంలో 15 రోజులుగా మంచినీరు రాక పోవటంతో తాగు నీరు లేక పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. తాళ్లూరు, కొత్త పాలెం గ్రామాల మధ్య చప్టా నిర్మాణం చేపట్టంతో అక్కడ పైప్ లైన్ పగిలిపోయినది. ఈ విషయమై ఆర్ డబ్ల్యు ఎస్, ఆర్ అండ్ బి అధికారులు గత ఆరు రోజుల క్రితం సమావేశమై ప్రత్యామ్నాయ పైప్ లైన్ ఏర్పాటుకు ఆర్ అండ్ బి అధికారులు అంగీకరించి తగిన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్కు సూచించారు. అయితే తగిన చర్యలు తీసుకోక పోవటంతో ఆ పనులు అలాగే నిలచి పోయాయి. దీనికి తోడు రామతీర్థంలో మోటార్ల మరమ్మత్తులు రావటంతో మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే నిత్యం అనేక మార్లు ఇప్పటికే అంతరాయం ఏర్పడుతూ నెలల పాటు నీటి సరఫరా అంతరాయం ఏర్పటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకుని నీటి సరఫరా చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.
