రోడ్డు ప్రమాదం లో గాయపడిన క్షతగాత్రులకు ప్రథమ చికిత్స.ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన ఏసీపీ శంకర్ రాజు సన్మానం.

బేగంపేట సెప్టెంబర్ 22,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించిన ఇద్దరు ట్రాఫిక్ సిబ్బందిని
తిరుమలగిరి డివిజన్ ఏసీపీ జి. శంకర్ రాజు
మంగళవారం ప్రత్యేకంగా అభినందించిసన్మానించారు. అల్వాల్-,లోతుకుంట రోడ్డులో జరిగినప్రమాదంలో గాయపడిన ద్విచక్ర వాహనదారులకు తిరుమలగిరి పీఎస్ కానిస్టేబుల్ ఎస్. విజయ్ కుమార్ (పీసీ 143), అలాగే రసూల్‌పురా జంక్షన్ వద్ద విధుల్లో ఉండగా కారు తగిలి గాయపడిన హోంగార్డు వీరశేఖర్‌కు బేగంపేట పీఎస్ కానిస్టేబుల్ జి. కిరణ్ కుమార్ (పీసీ 9599) తమ వద్దనున్న ఫస్ట్ ఎయిడ్ కిట్లతో వెంటనే ప్రథమ చికిత్స అందించి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజుమాట్లాడుతూ.అత్యవసర సమయాల్లో సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాథమిక చికిత్స అందించడం వల్ల పోలీసులపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరుగుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వి. సర్దార్ నాయక్, ఎస్సై ఎన్.ఎస్.కె. రాజు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *