తాళ్లూరు మండలంలో ఇరు గ్రామాలకు చెందిన ఇరువురు శుక్రవారం పాముకాటుకు గురైనారు. అందులో ఒకరు మృతి చెందగా మరోకరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మాధవరం గ్రామానికి చెందిన సోము అన్నపూర్ణ (40) పొలంలో మేత కోస్తుండగా పాము కాటుకు గురైనది. తాళ్లూరు పీహెచ్సీలో ప్రాధమిక చికిత్స నిమిత్తం ఒంగోలు తరలించగా మార్గమధ్యలో మృతి చెందినది. ఆమెకు భర్త శివారెడ్డి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.
కొత్తపాలెం గ్రామానికి చెందిన పున్నారెడ్డి పొలంలో పనులు చేస్తుండగా పాము కాటుకు గురైనాడు. తాళ్లూరు ఆర్ఎంపీ వద్ద ప్రాధమిక చికిత్స నిమిత్తం ఒంగోలు తరలించారు. ప్రవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.