సంచార నక్కల సామాజిక వర్గాన్ని ఆదుకోవాలి-బిజేపి మహిళా మొర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు

సంచార నక్కల జాతి కుటుంబాలను జీవన స్థితి గతులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆదుకునేలా చూస్తానని బిజేపి మహిళా మొర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు అన్నారు. ఆర్టీసీ డిపో ప్రక్కన, రహదారిపై గుడారాలు వేసుకుని జీవిస్తున్న వైనాన్ని శుక్రవారం బిజేపి మహిళా మొర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు పార్టీ బృందంతో కలిసి పరిశీలించారు. తమ జీవనం అస్తవ్యస్తంగా ఉందని, దోమలు కుట్టటం వలన అనారోగ్యం పాలవుతున్నామని, సరైన నివాసం లేవని, ప్రభుత్వ పథకాలు దరిచేరటం లేదని, రక్త హీనతతో మహిళలు, ఎదుగుదల లేక పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని అక్కడి మహిళలు తమ బాధలను తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వారికి బి విజయరావు హామీ ఇచ్చారు. జిల్లా మమిళా మొర్చా ఇన్చార్జి తీగల సత్యవతి, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరపల్లి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *