శ్రీగిరి గిరి ప్రదక్షణ కార్యక్రమం చారిత్రక ఘట్టం – మున్సిపల్ కమిషనర్ కే వెంకటేశ్వరరావు- శ్రీగిరి గిరిప్రదక్షిణ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులు.

ఒంగోలు నగరంలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో భక్తి భావాలను పెంచుతున్న శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ వారి కృషిని మున్సిపల్ కమిషనర్ కే వెంకటేశ్వరరావు అభినందించారు. శుక్రవారం శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ధనిశెట్టి రామునాయుడు మరియు కనమర్లపూడి బాలకోటేశ్వరరావులు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ వివరాలను కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువన్నామలై లో భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నట్లు మన ఒంగోలు నగరంలో శ్రీగిరి పర్వతంపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి స్వామి వారి నామాలు జపిస్తూ సామూహికంగా భక్తులు గిరిప్రదక్షిణ చేయడం చాలా అద్భుతమైన విషయమని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సెప్టెంబర్ 15వ తేదీ శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న శ్రీగిరి గిరి ప్రదక్షణ కార్యక్రమానికి రావలసినదిగా ఆహ్వానించిన కమిటీ సభ్యులకు తప్పనిసరిగా రానున్న రోజుల్లో వీలు చూసుకుని వస్తానని వారు తెలిపారు.

విద్యార్థులకు ఉన్నత ఆధ్యాత్మిక భవిష్యత్తు కలిగించడానికి, సాంప్రదాయాలను తెలపడానికి చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహకార అందించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కమిషనర్ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *