కూన వెంకటేష్ గౌడ్ మృతి చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్ శుక్రవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ఉదయం గాజుల రామారం లోని వారి నివాసానికి వెళ్లి కూన వెంకటేష్ గౌడ్ పార్ధీవ దేహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్యే వెంట సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, శ్రీహరి, కిషోర్, లక్ష్మీపతి, ఆరీఫ్, అబ్బా తదితరులు ఉన్నారు.

