ఇటీవల దొనకొండ మండలం గంగదేవపల్లి సమీపంలో మల్లెల వాగు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పూర్తిగా కాలి పడి ఉన్న విషయం స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. పోలీసుల దర్యాప్తు అనంతరం ఆ మహిళ… వృద్ధ మహిళ అని, వయస్సు 78 సంవత్సరాల పై బడి ఉంటుందని, చీరాల కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ వృద్ధ మహిళ దగ్గర ఉన్న డబ్బును వడ్డీలకు తిప్పుతూ ఉంటారని, డబ్బు బంగారం కోసమే ఆమెను చంపి గంగాదేవపల్లి గ్రామ సమీపంలో గల మల్లెల వాగు వద్దకు తీసుకువచ్చి కాల్చివేశారని పోలీసుల దర్యాప్తులో తెలినట్లు సమాచారం.
