మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృత దేహాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా, ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుర్క పల్లి నాగలక్ష్మి, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ కైపు వెంకట క్రిష్ణా రెడ్డి, సంతనూతల పాడు నియోజక వర్గ నాయకుడు పాలపర్తి విజేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


