అలవికాని హామీలతో అధికారంలోనికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చెయ్యాల్సిందే నని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బుధవారం ‘థాలీ బజావో ‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కైపు వెంకట క్రిష్ణా రెడ్డితో పాటు పలువురు వక్తలు మాట్లాడారు. సూపర్ సిక్స్ ను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసి పేదలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల సీఎంను చేసుకోవటం ఒక్కటే మార్గమని వక్తలు నొక్కి వక్కానించారు. ముందుగా మాగుంట పార్వతమ్మ మృతికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు.
