బ్యాంకులు, ఎటీఎంల వద్ద సెక్యూరీటిని పెంచుకోవాలని తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. మండలంలోని తాళ్లూరు, తూర్పుగంగవరం, బొద్దికూరపాడులో ఉన్న కెనరా, యూనియన్, ఎపీజీబి బ్యాంకు మెనేజర్లకు బుధవారం సెక్యూరిటి ఏర్పాటుపై నోటీసులు పోలీసులు అందించారు. ఇటీవల కాలంలో దొంగతనాలు పెరుగుతుండటంతో పోలీసులు ముందస్తు చర్యగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పూర్తి చర్యలు చేపట్టారు.



