తాళ్లూరు మండలంలో అన్ని పంచాయితీలలో గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ సానికొమ్మ సత్యం, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కాలేషా వలి, నాయకులు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, నవులూరి విద్యాసాగర్, కె రామయ్య, ఏపీవో మురళి, కార్యాలయ సిబ్బంది గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బెల్లంకొండ వారి పాలెంలో సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డిలు మహాత్మునికి నివాళులు అర్పించారు. గ్రీన్ అంబాసిడార్లకు దుస్తులు పంపిణీ చేసారు. మల్కాపురంలో సర్పంచి వలి మహాత్ముని విగ్రహానికి పూల మాలలు వేసి నివాలులు ఆర్పించారు. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎంసీ చైర్మన్ వైవీ రామిరెడ్డి, సర్పంచి శ్యామ్సన్, వైస్ సర్పంచి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, విశ్రాంత హెచ్ఎం అంజి రెడ్డి, ఇతర ఉద్యోగుల పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై మల్లిఖార్జున రావు గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఆయన సిద్దాంతాలను పాటిస్తే సమాజం ఎంతో ఉన్నత స్థానంలో ఉంటుందని అన్నారు.



