వైసిపి జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి శుక్రవారం అట్టహాసంగా బాధ్యతలు చేపట్టారు. నూతనం గా నిర్మించిన పార్టీ కార్యాలయంలో నూతన అధ్యక్షుడిగా ఆయన పీఠాన్ని అధిష్టించారు.
భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజర య్యారు. ప్రమాణస్వీకారం కోలా హలంగా జరిగింది. ఎన్నికల తర్వాత నిస్తేజంగా ఉన్న వైసిపి క్యాడర్ లో కొత్త ఊపు కనిపించింది. దర్శి, సంతనూతలపాడు, ఒం గోలు నియోజకవర్గాల నుంచి
భారీగానే తరలివచ్చారు. జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు డాక్టర్ బూచేపల్లి ని అభినందించారు. రాష్ట్ర పార్టీ తరపునే మాజీ మంత్రి పేర్నినాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చీమకుర్తి నుంచి ర్యాలీగా బయలుదేరిన డాక్టర్ బూచేపల్లి పట్టణంలో సాయిబాబా గుడిలో పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి కలెక్టరేట్ వద్దకు చేరుకొని జిల్లా నేతలతో కలిసి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. నూతన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడిగా జిల్లా నేతల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అందరూ అభినందించారు. కార్యాలయం కార్యకర్తలు, నేతలతో కిటకిటలాడింది. అక్కడ జరిగిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ….. 2029లో వైసిపిని మళ్లీ అధికారంలోకి తెచ్చేది కార్యకర్తలేనన్నారు. తనలాంటి నాయకులు వస్తుంటారు.. పోతుంటారని, కార్యకర్తలే ఫైనల్ అని చెప్పారు. జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చని, మోసపు మాటలు మాత్రం లేవన్నారు. కొందరు చెబుతున్నట్లుగా ఈవీంఎలను మోడీతో కలిసి మోసం చేసి ఉండవచ్చన్నారు. జగన్ జనాన్ని మోసం చేయడానికి గోధుమరంగు పంచకట్ట లేదని, ఎర్రలుంగీ కట్టలేదని పేర్కొన్నారు. తనకు కులం లేదని మొన్న చెప్పి…. ఇవాళ కులం ఉందని డ్రామా మాటలు…. జగన్ ఏ రోజూ చెప్పలేదన్నారు. చంద్రబాబులా ఎవరి సాయంతోనూ జగన్ అధికారంలోకి రాలేదన్నారు. సింగిల్గానే వచ్చారన్నారు. జనానికి మేలు చేయాలనే తపనతో కార్యకర్తలను కూడా పట్టించుకోలేకపోయామని ……జగన్ కూడా బాధపడుతున్నారని గుర్తుచేశారు….. కార్యకర్తల ఇబ్బందులను చూడలేకపోయామన్నారు….. కూటమి ప్రభుత్వం వైసిపి కార్యకర్తలను వేధిస్తోందన్నారు…. పోలీసుల అండదండలతో వైసిపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఆరు నెలల తర్వాత వైసిపి కార్యకర్తలు తిరగబడటం మొదలు పెడితే మీరు వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లు అధికారం అనుభవించి ఎక్కడికైనా వెళ్లేవాళ్లు వెళ్లవచ్చు అని వ్యాఖ్యానించారు. జగన్ కు వెన్నుపోటు పొడిచే అలవాటు నిజమైన కార్యకర్తలకు ఎవరికీ లేదన్నారు. పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ….2029లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఐక్యంగా పనిచేస్తామన్నారు. జిల్లాలో 8 నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులు గెలిచేలా పనిచేస్తామన్నారు. పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పూర్వవైభవం తెచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. కష్టకాలంలో నిజమైన కార్యకర్తలే పార్టీకి అండగా ఉంటారన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను చివరి శ్వాస వరకు జగనన్నతోటే ప్రయాణమని స్పష్టం చేశారు. తనకు పార్టీ అధ్యక్ష పదవి ముల్ల కిరీట మని అందరూ చెబుతున్నారని… అయితే దాన్ని పూల కిరీటింగా తాను భావించి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. ఇటీవల కాలంలో వినాయకుని నిమజ్జన సమయంలో కూడా ఎక వక్షంగా వ్యవహరిస్తున్న పోలీసుల విధానాన్ని సమిష్టిగా ఎదుర్కొంటామని అన్నారు.
సభలో జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ, కాకుమను రాజశేఖర్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమానికి వివిధ నియోజకవర్గాల నుంచి మండలస్థాయి ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున
హాజరయ్యారు. బూచేపల్లిని అభినందించారు.





















