హైదరాబాదు నగరంలో డిజిలపై విధించిన నిషేధాన్ని బతుకమ్మ పండుగకు ఒక రోజుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ లష్కర్ జిల్లా సాధన సమితి నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ కు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర పండుగ గా గుర్తించిన బతుకమ్మ పండుగ కు అట పాటలు ఎంతో ముఖ్యమని వారు వివరించారు. అట పాటల తో మహిళలు జరుపుకునే పండుగకు ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు. మత సంబంధం కలిగి ఊరేగింపుగా వెళ్ళే వాటికీ డీజే పై నిషేధం విధించడం హర్షనియమని అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ కమీషనర్ కు వివరించారు. కేవలం ఒక రోజు మహిళలు ఎంతో సంబరంగా జరుపుకునే ఈ పండుగకు నిషేధాజ్ఞలు విధించడం సమంజసం కాదని ఈ విషమం పై హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, మరియు మహిళ మంత్రులు స్పందించి డీజే పై ఒక రోజు సడలింపు ఇవ్వాలని అయన కోరారు. తెలంగాణ పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో పునరాలోచించాలి అని పవన్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కమీషనర్ ను కలిసిన వారిలో బాలరాజ్ యాదవ్ బాబురావు శైలందర్, జగదీష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బాలిరెడ్డి, సునీల్ ముదిరాజ్, అజిజ్, లు వున్నారు.
