బేగంపేట ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవాలయానికి దివ్య రామ బాణం చేరుకుంది. దివ్య రామబాణాన్ని చూసి తరించేందుకు వీవీఐపీలు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దివ్య రామబాణాన్ని చూసి పూజలు నిర్వహించారు. దివ్య రామ బాణాన్ని దర్శించుకున్న వారిలో సినీ నటులు సుమన్, వ్యాపారవేత్త , టిఎంసి బ్యాంక్ చైర్మన్ నంగునూరు చంద్రశేఖర్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ సత్యం శ్రీరంగం, బేగంపేట్ ఇన్స్పెక్టర్ రామయ్య, గంగాధర్ గౌడ్ అరుణ్ గౌడ్, సంజయ్ విడియాల గోవిందరావు శేఖర్ కృష్ణ చిరంజీవిలు జగదీష్ బాల మోహిత్ తదితరులు దివ్య రామబాణాన్ని వీక్షించి తరించారు. వీరితోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర బిల్లు మరియు బాణాల దర్శనం కోసం తరలివచ్చారు. చల్లా శ్రీనివాస్ శాస్త్రి కానుకగా అందించిన ఒక కిలో బంగారం మరియు 13 కిలోల వెండితో చేసిన దివ్య రామబాణం ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని, ఎంతోమంది భక్తులు దివ్య రామబాణాన్ని వీక్షించే తరించారని ఈ అవకాశాన్ని కల్పించిన వారికి ఆలయ నిర్మాణ దాత, నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు విశాల్ సుదాం కృతజ్ఞతలు తెలియజేశారు. సందర్భంగా ఆలయానికి వచ్చిన అతిథులకు విశాల్ సుధామ శాలువలతో సత్కరించి మొ మెంట్ లు అందించారు.
