అర్ధరాత్రి వేళలోనూ ప్రజలకు అండగా అధికారులు నిలిచారు. ఈ ఘటన. …కొండపి నియోజకవర్గం టంగుటూరులోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలోకి వరద నీరు రావడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం ప్రొక్లైన్ సహాయంతో యుద్ధ ప్రాతిపదికన నీటిని బయటకు పంపారు. వాటర్ క్లియరెన్స్ పనులను ప్రత్యక్షంగా తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో దేవసేన కుమారి పరిశీలించారు. అర్ధరాత్రి సైతం తమకు సేవలందించినందుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

