గుండ్లకమ్మ నది ప్రవాహంలో వ్యక్తి గల్లంతు

గుండ్లకమ్మ నదిలో ఈత కోసం దిగిన గంగిశెట్టి బ్రహ్మనాయుడు (31) అనే వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలోకి ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో గురువారం తన స్నేహితులతో కలిసి మద్దిపాడు మండలం రాచవారిపాలెం గ్రామంలో ఈత కోసం బ్రహ్మనాయుడు నదిలోకి దిగారు. ఈ క్రమంలో అతడు ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్థానిక రెవెన్యూ అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మృతునికి భార్య మౌనిక, కుమారుడు సిద్ధార్థ వర్మ ఉన్నట్లు చెప్పారు. వర్షాల వల్ల నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు ఎవరూ ఈత కోసం నదిలోకి దిగవద్దని అధికారులు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *